Tuesday, May 2, 2023

తెలివితక్కువ గాడిద.

అనగనగా ఓ ఊళ్లో గాడిద ఉండేది. తనకు తాను చాలా తెలివైన గాడిదగా భావిస్తుండేది. ఓ రోజు గాడిద యజమాని ఓ ఉప్పు బస్తాను దానిపై పెట్టి వేరే చోటుకు తరలించాలనుకున్నాడు. మార్గ మధ్యలో ఓ చిన్న సెలయేరు దాటి వెళ్లాల్సి ఉంది. ఇలా గాడిద ఆ ఉప్పు బస్తాను మోసుకుంటూ వెళుతుండగా దానికి ఓ ఆలోచన తట్టింది. వెంటనే ఆ ఉప్పు బస్తాను నీటిలోకి పడేసింది. దీంతో సగం ఉప్పు నీటిపాలైంది. మిగిలిన ఉప్పు బస్తాను తిరిగి గాడిదపై పెట్టగా అది చాలా తేలికగా అనిపించింది. గాడిద చాలా సంతోష పడింది. ఇలా ప్రతిరోజు ఈ గాడిద ఉప్పు బస్తాను నీటిలో పడేయడం... తేలికగా మారిన ఉప్పు బస్తాను సంతోషంగా మోసుకెళుతూ ఉండేది. అయితే గాడిద అతి తెలివిని పసిగట్టిన యజమాని ఓరోజు దూది బస్తాను ఆ గాడిదపై పెట్టాడు. ఈ బస్తాను కూడా ఆ సెలఏరులో పడేస్తే మరింత తేలికగా మారుతుందని భావించిన గాడిద... ఆ దూది బస్తాను నీటిలో పడేసింది. అయితే దూది నీటిలో మునగడంతో నీరు మొత్తం దూదిలోకి చేరి అది బరువుగా మారింది. ఇక ఆ బరువును మోయడంలో ఆ గాడిద చాలా ఇబ్బంది పడింది. ఓ గుణపాఠం నేర్చుకుంది. ఆ తర్వాత ఎప్పుడూ ఇలాంటి వేషాలు వేయకుండా పని సరిగ్గా చేయడం ప్రారంభించింది

No comments:

Post a Comment