Thursday, May 4, 2023

అవివేకం

Learn with SIVA Sir..
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తు తున్నది. కొంతసేపటికి దానికొక ఎలుక ఎదు రొచ్చింది.

"చీమా చీమా ఎందుకంత వేగంగా పరుగె త్తుతున్నావు?" అని చీమను అడిగింది ఎలుక. "అక్కడొక పెద్దజంతువుంది. నాకన్నా

చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను" అంది చీమ.

"అయితే అది నన్ను కూడా తినేస్తుం దేమో, నేనూ నీతో పాటే పరుగెత్తుతాను" అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది. అవి రెండూ పరుగెడుతుండగా ఒక

కుందేలు ఎదురొచ్చింది. "ఎందుకలా పరుగెడుతున్నారు?" అని

కుందేలు.

“అక్కడొక పెద్ద జంతువుంది. నా కన్నాచాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరుగెత్తుతున్నాను." అంది చీమ.

"అవునవును" అంది ఎలుక.

దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగు లంకించింది.

కొంతదూరం వెళ్లగా వాటికి ఒక నక్క ఎదు రొచ్చి అదే ప్రశ్న వేసింది. చీమ మళ్లీ అదే సమా దానం చెప్పింది.

వాటితోపాటు నక్క కూడా పరుగెత్తింది. చాలా దూరం పరుగెత్తాక నక్క అలసటతో

"ఇంక నావల్ల కాదు. నేను పరుగెత్తలేను. ఇంతకూ ఆ జంతువు ఏమిటి?" అని అడి గింది.

"అదా! అది పెద్ద గండు చీమ. నావైపే వస్తుంటే తనేం చేస్తుందోనని భయపడ్డాను" అని చెప్పింది చీమ.

ఎలుక, కుందేలు, నక్కకు కోపం వచ్చి గండు చీమ మమ్మల్ని తింటుందా? అనవసరంగా భయ పెట్టావు" అని కళ్లెర్ర చేసాయి.

"నన్ను తింటుందని చెప్పాను. మిమ్మల్ని తింటుందన్నానా" అంది చీమ. నిజమే కదా అనుకున్నాయి ఎలుక, కుందేలు, నక్క.

నీతి : ఇతరులు ఎందుకు భయపడు తున్నారో తెలియకుండానే మనం కూడా భయపడడం అవివేకం

No comments:

Post a Comment