Sunday, July 23, 2023

10th Maths Important Questions

10th Maths Chapter wise Important questions 
Important Questions for Class 10 Maths cover all the important topics from all the chapters as per the AP Board Class 10 Maths syllabus. It is a fruitful resource for Class 10 Maths student, so that they can clear out concepts without any doubt.

Click below link 👇👇


👍👍👍👍👍👍👍👍👍👍

Sunday, May 14, 2023

దెబ్బకు ఠా..నక్క,తోడేలు ముఠా...

సుందరయ్య ఓ గొర్రెల మందను పెంచుతుండేవాడు. వాటిని మేపేందుకు రోజూ అడవికి తీసుకెళ్లేవాడు. అవి మేత మేస్తున్న సమయంలో ఖాళీగా కూర్చోకుండా.. పచ్చగడ్డిని కోసేవాడు. సాయంత్రం మందతో పాటు ఆ పచ్చగడ్డి మోపును ఇంటికి తీసుకెళ్లేవాడు. ఆ గడ్డి మోపు.. రాత్రి వేళ గొర్రెలతోపాటు పశువుల ఆకలి తీర్చేందుకు అక్కరకు వచ్చేది. ఒకరోజు అడవి. నుంచి మందను ఇంటికి తీసుకొస్తూ.. గ్రామ పొలిమేరకి చేరుకున్నాడు. అదే సమయంలో ఓ గాడిద తనను వెంబడించడం సుందరయ్య గమనించాడు. నెత్తినున్న గడ్డి మోపును చూసి, ఆ గాడిద తనవెంట వస్తుందనుకొని దాన్ని వెళ్లగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ, ఎంతకీ అది వెనకడుగు వేయలేదు. ఇక చేసేది లేక.. ఇంటికి చేరుకున్నాడు.

గడ్డి మోపు వైపు చూస్తూ ఆశగా గొర్రెల మంద దగ్గరే నిల్చుండిపోయిందా గాడిద. 'ఈ పనికిమాలిన గాడిద ఇలా నావెంట పడుతుందేంటి? అంటూ కర్రతో దాన్ని కొట్టబోయాడు. అక్కడే ఉన్న బామ్మ.. అతడిని అడ్డుకుంది. 'చూడు సుందరయ్యా.. ఈ ప్రపంచంలో పనికిరానిదంటూ ఏదీ లేదు. అందులోనూ మూగజీవాలను ఆదరిస్తే, జీవితాంతం మనకు రుణపడి ఉంటాయి' అంది. 'గాడిద వల్ల మనకేం ఉపయోగం బామ్మా..?. పచ్చగడ్డి తినడానికే ఇక్కడ ఆగిందది' అని విసుక్కుంటూ సమాదానమిచ్చాడు. సుందరయ్య. 'ప్రశాంతంగా ఆలోచిస్తే.. నీకే ఏదో ఒక మార్గం కనిపిస్తుంది.. ' అందామె. 'కుక్కయితే విశ్వాసంతో ఉంటూ దొంగల పని పడుతుంది. పిల్లేమో ఎలుకలు రాకుండా చూస్తుంది. మరి ఈ గాడిద... అంటూ నసిగాడు. సుందరయ్య.

'ఈ గాడిదను ప్రతిరోజూ అడవికి తీసుకెళ్లు వచ్చిపోయే దారిలో కనిపించే ఎండు పుల్లలను ఏరి దాని వీపున వేసుకొస్తే, మనకు వంటచెరకు కొరత తీరుతుంది' అంటూ ఒక ఉపయోగాన్ని వివరించింది బామ్మ. 'నిజమే బామ్మా.. అంటూ గాడిదను పాకలోకి తోలుకెళ్లి దాని ముందు పచ్చగడ్డి వేశాడు. అప్పటికే ఆకలితో ఉన్న గాడిద క్షణం కూడా ఆలస్యం ! చేయకుండా కడుపు నింపుకొంది. ఆ వెంటనే దాన్ని అక్కడే ఉన్న ఓ కొయ్యకు కట్టేశాడు. అప్పటికే సుందరయ్య తనను పెంచుకునేందుకు సిద్ధమయ్యాడని గాడిదకు అర్థమైంది. ఆ రాత్రి గడిచింది. తెల్లవారి మందతోపాటు గాడిదనూ అడవికి తోలుకెళ్లాడు. అలా నాలుగు రోజులు గడిచాక సుందరయ్యకు మచ్చికైందది.. అప్పటినుంచి అడవికి వెళ్లివచ్చేటప్పుడు.. ముందు గొర్రెల మంద.. వెనక సుందరయ్య.. ఆ తర్వాత గాడిద నడిచేది.

ఒకరోజు అడవిలో గొర్రెల మంద, గాడిదతోపాటు. సుందరయ్య నడుస్తున్నాడు. దూరం నుంచి ఆ గొర్రెల గుంపును నక్క, తోడేలు చూశాయి. చూడగానే వాటికి నోరూరింది. 'కాపరి ఏమరుపాటుగా ఉన్నప్పుడు గొర్రె పిల్లను ఎత్తుకొచ్చి విందు చేసుకుందామా!" అని నక్కను అడిగింది తోడేలు. 'ఒకసారి నేను కూడా నీలాగే ఆశపడి, ఏమీ ఆలోచించకుండా మందకు ఎదురుగా వెళ్లా, ఓ పిల్ల గొర్రెను లాక్కొచ్చే ప్రయత్నం చేశాను. అందులో ఉన్న పొట్టేలు గమనించి, తన తలతో నన్ను బలంగా ఢీ కొట్టింది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లయింది. నా పరిస్థితి. బతుకుజీవుడా అంటూ పరుగు పెట్టాను' అంటూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది నక్క. 'నీవన్నీ తొందరపాటు పనులే. నిదానమే ప్రధానమని పెద్దలు చెప్పారు కదా.. ఒకటికి పదిసార్లు.. ఆలోచించి ఎత్తువేయాలి. గొర్రెలకు ఎదురుగా వెళ్లే పరాభవమే మిగులుతుంది' అంటూ హేళనగా మాట్లాడింది తోడేలు,

ఆ మాటలకు నక్క చిన్నబుచ్చుకుంది. 'తెలివితేటల్లో నీ అంత గడసరిని కానులే. పిల్లి నల్లదో, తెల్లదో అన్నది ముఖ్యం కాదు.. ఎలుకను పట్టిందా? లేదా? అనేదే విషయమని మా అమ్మమ్మ. చెబుతుండేది. గొర్రె పిల్లను తెచ్చి విందు ఇస్తానంటే నాకంటే. సంతోషించే వాళ్లెవరుంటారు.. నీ తెలివికి జేజేలు పలికి, నాకంటే నువ్వు ఇంకా జిత్తులమారివని అడవిలో అందరికీ చెబుతానులే... అని తోడేలుతో అంది నక్క

దాంతో తోడేలు మీసం మెలేస్తూ.. 'తెలివి ఎంత ప్రదర్శించామన్నది ముఖ్యం కాదు.. పని జరిగిందా లేదా అనేదే. ప్రధానం. నువ్వు చెట్టు చాటునే ఉండి, నా పనితనాన్ని గమనించు.. అంటూ గొప్పలు పోయింది తోడేలు, అనువైన సమయం కోసం చూసి, గొర్రెల మందకు వెనక వైపుగా  వెళ్లిందని గాడిద వెనక చేరి.. సుందరయ్యకు కనిపించకుండా. నక్కి నక్కి ఒక్కో అడుగూ వేయసాగింది. ఏదో అలికిడి కావడంతో వెనక్కి తిరిగి చూసింది గాడిద,

తన వెనకే వస్తున్న తోడేలు వైఖరి అనుమానాస్పదంగా ఉండడంతో.. స్వామిభక్తి ప్రదర్శిస్తూ వెనక కాలితో ఒక్క తన్ను తన్నింది. దాంతో తోడేలు పల్టీలు కొడుతూ నక్క ముందు ఎగిరి పడింది. ఆ శబ్దానికి సుందరయ్య ఒక్కసారిగా తిరిగి చూశాడు. విషయం అర్ధం కావడంతో.. 'ఈ గాడిద నాకు ఈ విధంగానూ ఉపయోగపడింది అనుకుంటూ దాని తలను నిమిరాడు. గాడిద కూడా అంతే చనువుతో సుందరయ్య చేతిలో ఒదిగిపోయింది. అక్కడ నక్క ముందు పడిన తోడేలు మూలుగుతూ పైకి లేచే ప్రయత్నంలో ఉంది. తోడేలు బావా.. మన తెలివి తెల్లారినట్టే. ఉంది. అప్పుడు ముందు నుంచి వెళ్లి నేను భంగపడ్డాను. ఇప్పుడు వెనక నుంచి నువ్వెళ్లి మూలుగుతూ వచ్చావు. అందుకే అంటుంటారు పెద్దలు.. ముందూ వెనకా ఆలోచించిన తర్వాతే ఏ పనైనా చేయమని.. అని నవ్వు ఆపుకొంటూ తోడేలును ఓదార్చిందా నక్క

Friday, May 12, 2023

దేవుడి తెలివి

Learn with SIVA Sir కాశీనాథుడు అనే వ్యక్తి ఒకరోజు అరణ్యమార్గం ద్వారా వెళుతున్నాడు. నడచి నడచి అతనికి నీరసం వచ్చింది. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు దశదిశలకు వ్యాపించినట్టు ఎంతో పెద్దదిగా వుంది. చెట్టు నీడన చల్లగా ఉంది. అలసిపోయిన కాశీనాధుడు హాయిగా ఆ చెట్టుకింద విశ్రమించాడు. అక్కడ చెట్టు కింద అంతటా చిన్నచిన్న మర్రికాయలు వున్నాయి.

అక్కడికి కొంచెం దూరంలో ఒక గుమ్మడి తీగ అల్లుకుని ఉంది. దానికి కాసిన గుమ్మడి కాయలు చాలా పెద్దవిగా ఉన్నాయి.
కాశీనాథునికి నవ్వు వచ్చింది. "భగవంతు డికి ఆలోచనాజ్ఞానం తక్కువగా వున్నట్టుంది ఇంత పెద్ద మర్రిచెట్టుకు ఇంత చిన్నకాయలు, అంత సన్నగుమ్మడి తీగకు అంత పెద్దకాయలు సృష్టించాడు" అనుకుంటూ కాశీనాథుడు నిద్ర పోయాడు.

అతను నిద్రలేచి చూసేప్పటికి అతని మీద చిన్న చిన్న మర్రికాయలు పడి వున్నాయి. అతనికి వెన్నులో జలదరిచింది. ఒకవేళ ఆ గుమ్మడికాయలంత కాయలు ఈ మర్రి చెట్టుకు కాసి ఉంటే అవి మీదపడి తన తల పగిలి చచ్చేవాడు. కాబట్టి దేవుడే తెలివైనవాడు ఎంతో దూర దృష్టి కలవాడు అనుకుని వెళ్లి పోయాడు కాశీ నాథుడు.

Thursday, May 11, 2023

ఏనుగు - ఎలుక

ఒక అడవిలో ఒక ఏనుగు - ఒక ఎలుక ఉండేవి. ఏనుగు ఉత్సాహంగా అడవంతా కలియ తిరుగుతుండేది.

అంతపెద్ద ఏనుగు ఆకారాన్ని చూస్తే ఎలుకకు ఆశ్చర్యంగా ఉండేది.

ఒకరోజు ఎలుక ఏనుగు దగ్గరికి వెళ్లి "ఏనుగు! ఏనుగూ! నాకు నీతో స్నేహం చేయాలని ఉంది" అని చెప్పింది.

ఆ మాటతో ఏనుగుకు బోలెడంత కోపం వచ్చింది.

"ఛీ! ఛీ! నా కాలిలో ముల్లంత లేవు. నీకు నాతో స్నేహం కావాలా పో అవతలికి అని కసిరికొట్టింది.

దాంతో ఎలుకకు రోషం వచ్చింది. "నేను నీతో ఎందుకు స్నేహం చేయకూ డదు? నువ్వు నల్లగానే ఉన్నావు, నేనూ నల్ల గానే ఉన్నాను. నీకు తోక ఉంది. నీకు కళ్లు. చెవులు ఉన్నాయి. నాకూ కళ్లూ చెవులూ వున్నాయి. ఇద్దరికీ తేడా ఏముంది?" అని
అడిగింది.

“నేను నీకంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దగా వున్నాను. నీవంటి అల్పజీవితో నేను స్నేహం చేయను” అని ఏనుగు వెళ్లిపోయింది.

అయినా ఎలుక మాత్రం వదలకుండా ఏనుగు ఉన్న చోటనే తిరుగాడసాగింది. ఒకరోజు అడవిలో ఏనుగులను పట్టు కునే వాళ్లు వచ్చి పెద్ద వలవేసి ఏనుగును పట్టుకున్నారు.

"రాత్రికి రహస్యంగా వచ్చి ఏనుగును తీసుకు పోదాం" అనుకుని వాళ్లు వెళ్లిపో.. యారు.

"వలలో చిక్కిన ఏనుగు భోరున ఏడు స్తుండగా ఎలుక వచ్చి "అయ్యో! ఏడవకు. నేను నా మిత్రులను తీసుకువచ్చి నీకు బంధ విముక్తి కలిగిస్తాను" అని చెప్పి ఇంకా ఎలుకలను తీసుకువచ్చింది. అవన్నీ కలిసి వల మొత్తం కొరికి ఏనుగును విడిపించాయి.

అన్నీ కలిసి వేరే చోటికి పారిపోయాయి. ఆనాటి నుండి ఏనుగు ఎలు కతో స్నేహంగా వుంటూ దాన్ని తన వీపు మీద ఎక్కిం చుకుని సరదాగా అడవి. అంతా తిరిగేది.

వేటగాళ్లు ఏనుగును పట్టుకున్నప్పుడల్లా ఎలుక వల తాళ్లను కొరికేసి ఏనుగును రక్షించేది.

Wednesday, May 10, 2023

మెలకువ


కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఈ వ్యాపారం చేయడం కష్టమే, ' అంటూ కూలబడిపోయాడు కూరగాయలు అమ్మే సూరయ్య.

'నువ్వు అలా అంటే ఎలా? అలవాటు పడ్డ వ్యాపారం తెలివిగా మసలుకొని అమ్మకాలు కొనసాగించడమే మంచిది. కొత్త వ్యాపారమైతే అలవాటు పడ్డవరకు దినదిన గండమే,' అంటూ భర్తను ఉత్సాహపరచసాగింది భార్య రత్నాలు.

'నువ్వు అలా అంటున్నావు గాని గంట నుండి కిలో నలభై, కిలో నలభై అంటున్నా కొనేవారి సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది, ఉసూరుమంటూ చెప్పాడు.

'కొద్ది సేపు నువ్వు విశ్రాంతి తీసుకో, నేను అమ్మిపెడతా ఈ కూరగాయాలు,' అంటూ భరోసా ఇచ్చింది రత్నాలు.

సూరయ్య నిద్రకు ఉపక్రమించాడు. గంటపోయాక లేచి చూశాడు. కూరగా యలన్నీ అమ్ముడైపోయాయి, 'నష్టానికి అమ్మేశావా?' అనుమానంగా అడిగాడు. 'లేదు. నువ్వు చెప్పే రేటుకే అమ్మాను. నా తెలివికి పదును బెట్టి పావుకేజీ పది

పావుకేజీ పది అని అరిచాను. నలభై రూపాయల దగ్గర పదిరూపాయలు తక్కువగా అనిపించడంతో బరువు విషయం మరిచి కావల్సినవి కొన్నారు, అసలు విషయం చెప్పింది రత్నాలు.

భార్య తెలివికి మెచ్చుకుని ఆ రోజునుండి భార్య చెప్పిన మెలకువతో వ్యాపారం చేస్తూ నిశ్చింతగా ఉన్నాడు సూరయ్య.